ఉల్లెంగల ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు
చేర్యాల,ఏప్రిల్ 20 అక్షిత ప్రతినిధి: ముస్లింల పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా చేర్యాల మండలంలోని కాశ గుడిసెల గ్రామంలో బుధవారం రాత్రి ఉల్లెంగల సేవా ట్రస్ట్ చైర్మన్,బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగల ఏకానందం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది.అనంతరం ఏకానందం మజీద్ ఆవరణంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల ఐక్యతకు భారతదేశం గొప్పతనం అని,పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్నవారికి అన్నదానం చేయడం పుణ్య కార్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎస్.కె ఫకీర్,ఇమామ్,బాబా,చాన్మియా, మజీద్ కమిటీ సభ్యులు మరియు కలవాలా రాజిరెడ్డి,పుప్పాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.