*అంతిమయాత్రలో పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి
రంగా రెడ్డి, అక్షిత ప్రతినిధి:ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల్ మండల్ లింగంపల్లి గ్రామంలో గురువారం ఉదయం ఏర్పుల రామచందర్ ఆకస్మికంగా (గుండెపోటుతో) మరణించిన విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న టిపిసిసి సభ్యులు , నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి . ఆయన లింగంపల్లి గ్రామం విచ్చేసి భౌతిక దేహంపై పూలమాలవేసి, నివాళులు అర్పించి ,కుటుంబ సభ్యులు ఓదార్చి, మనోధైర్యాన్నిచ్చి ,ఆర్థిక సహాయం అందజేసి అంతిమయాత్రలో పాల్గొన్నారు .

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మూర్తి, ఐలయ్య, కరుణాకర్ రెడ్డి, బుర శివ గౌడ్, బంధుమిత్రులు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.