దివ్యాంగులకు బస్సుపాస్ లు అందజేసిన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
పినపాక అక్షిత ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడున్నా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా బూర్గంపహాడ్ మండలం లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు, ఎంపీడీవో వివేక్ రామ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత బస్సు పాసులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల జడ్పిటిసి కామారెడ్డి శ్రీలత మాట్లాడుతూ పుట్టుకతో అంగవైకల్యం 50% కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి, మరియు డయాలసిస్ పేషంట్లకి , విద్యార్థుల కి ఉచిత బస్సు పాస్ ని అందిస్తారు అన్నారు.

మండల స్థాయి లోనే కాక ప్రతి పంచాయతీ లో కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో బస్సు పాస్ పంపిణి కార్యక్రమం నిర్వహించడం జాగురుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నారు. ప్రజల కోసం ఈలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న, ఎంపీడీవో యం.వివేక్ రామ్, భద్రాచలం డిపో మేనేజర్ జి.రామారావు గారు,మరియు మారి సిబ్బంది, గ్రామపెద్దలు, మహిళ, గ్రామస్తులు పాల్గొన్నారు.