మత సామరస్యానికి ప్రతీక ఇప్తార్ ధావత్ ఏ ఇప్తార్ విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి

మత సామరస్యానికి ప్రతీక ఇప్తార్
ధావత్ ఏ ఇప్తార్

విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
రంజాన్ సందర్భంగా నల్గొండ పట్టణం మదీన మసీద్ లో గురువారం ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరపున దావత్ ఏ ఇప్తార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథి గా హాజరు అయ్యారు.స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి,ఎస్.పి.అపూర్వ రావు,మున్సిపల్ చైర్మన్ యం. సైది రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం లో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేసి ప్రార్థనలు నిర్వహిస్తారని అన్నారు. మతః సామరస్యం, లౌకికవాదం తో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు పరిపాలన మార్గ దర్శనం గా ఉంటూ తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచి గా ఉందని అన్నారు.దేశం లో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో,ధైర్యంగా,ఆత్మ విశ్వాసంతో ఉంటే ఆరోగ్య వంతమైన సమాజం ఉంటుందని విశ్వాసం తో పరిపాలన సాగిస్తున్న నాయకుడు కె. సి.ఆర్ అని తెలిపారు.

ప్రజలు అందరూ కలిసి మెలిసి సుఖ సంతోషాలతో, సోదర భావం తో కలిసి మెలిసి ఉండాలని,ఒకరి ఆచార,సంస్కృతి ,సాంప్రదాయాలు గౌరవించు కోవాలని,రాష్ట్ర ప్రుభుత్వం క్రిస్మస్, రంజాన్,,హిందూ వులు అన్ని మతాలను సమాన దృష్టి తో గౌరవిస్తూ పండుగలను నిర్వహిస్తున్నట్లు,ప్రభుత్వం తరపున విందు ఏర్పాటు చేస్తుందని అన్నారు.నల్గొండ జిల్లాలో అన్ని పట్టణాల లో ఇప్తార్ విందు నిర్వహించు కుంటు, ఈ రోజు నల్గొండ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అందరూ కలిసి,ఐక్యత తో ఉండాలని,సమాజానికి దేశానికి హితమని,తెలంగాణ ప్రజలు ఆదర్శంగా ఉండాలని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking