మత సంస్కరానికి ప్రతిక ఇఫ్తార్ విందు నల్లబోతు సిద్ధార్థ

మత సంస్కరానికి ప్రతిక ఇఫ్తార్ విందు నల్లబోతు సిద్ధార్థ
అక్షిత న్యూస్ మాడుగులపల్లి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు నాయకులతో కలిసి ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ముస్లిం సోదరులకు స్వయంగా వడ్డించారు.ఈ సందర్భంగా నల్లబోతు సిద్ధార్థ మాట్లాడుతూ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాక ముందు పండుగలకు కానుకలు లేవు,ఇఫ్తార్ విందులు లేవని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ప్రతి మతాన్ని గౌరవించుకుంటున్నామని. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకోవడం ప్రత్యేక ప్రార్థనలు జరపడం చాలా సంతోషంగా ఉందని.అల్లాహ్ అందరినీ చల్లగా చూడాలని అందరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలోజడ్పీ కో ఆప్షన్ మోషన్ అలీ, ఎస్సై కైగురి నరేష్ కుమార్, ఎంపీడీవో జితేందర్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ శివకుమార్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, పిఎసిఎస్ చైర్మన్ రాములు గౌడ్ ఆర్ఐ అత్తరలీ, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నిమ్మల నవీన్ రెడ్డి, మసీద్ కమిటీ అధ్యక్షులు జానిమియ, సర్పంచ్ మారుతి వెంకట్ రెడ్డి,ఎంపీటీసీ కనక రెడ్డి,రసూల్, సతీష్, రాజు, శీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking