అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి రంజాన్ వేడుకలకు హాజరైన. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి.
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
రంజాన్ వేడుకలకు హాజరైన. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
పినపాక అక్షిత ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణం లోని సిఎస్పి వద్ద గల ఉన్న ఈద్గా దగ్గర ఏర్పాటుచేసిన రంజాన్ పండుగ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ
ముస్లిం ప్రజానీకానికి సీఎం కేసీఆర్ అండగా ఉంటారని ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ముబారక్ పథకం ద్వారా ప్రతి పేదింటి ముస్లిం ఆడబిడ్డలకు 10,00116, రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన అన్నారు.

రంజాన్ ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని దైవ ప్రార్థనలు ఉపవాస దీక్షలు జీవనశైలిని మార్చుతున్నాయన్నారు. అందరికీ అల్లా దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని సర్వ మతల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దేనానన్నారు.