మద్దూరు మహిళ అరోగ్య కేంద్రంలో త్రాగు నీరు కరువు గొంతు ఎండుతున్న పట్టించుకోని వైద్య సిబ్బంది

మద్దూరు మహిళ అరోగ్య కేంద్రంలో త్రాగు నీరు కరువు

గొంతు ఎండుతున్న పట్టించుకోని వైద్య సిబ్బంది

మద్దూరు అక్షిత న్యూస్:

మహిళలకు మెరుగైన ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో ప్రవేశ పెట్టిన మహిళా అరోగ్య కేంద్రంలొ త్రాగు నీరు లేక కేంద్రానికి వచ్చిన మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని నెలలుగా రోగుల సంఖ్య పెరగడం ఎండలు తీవ్ర రూపం దాల్చడం వల్ల నీటి కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైయిందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.ఊరికి కిలో మీటర్ దూరంలో ఉండడం చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు అధికంగా రావడం జరిగిన త్రాగు నీరు లేక రోగులు ఆసుపత్రికి రావాలంటే జంకుతున్నారు.తక్షణమే జిల్లా వైద్యాధికారి పట్టించుకోని ఆసుపత్రిలో త్రాగు నీరు సౌకర్యం కల్పించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking