మత సామరస్యానికి ప్రతీక రంజాన్ * బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

* బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

త్యాగానికి సోదరభావానికి మతసమరస్యానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే పండుగ రంజాన్ అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు. రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం ముస్లిం సోదర సోదరీమణులు అత్యంత నిష్టతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను పాటించి తమ ఆదాయంలో కొంత భాగాన్ని దానం చేసి ఆత్మ సంతృప్తి పొందుతారని పవిత్ర ఖురాన్ లోని అల్లా మహమ్మద్ ప్రవక్త బోధనలు మనసావచ ఆచరించడమే ఇస్లాంమత సంప్రదాయమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు, సాయి, గుడివాడ రాజేందర్, అల్లకొండ శరత్, సందేలా సందీప్, తాటిపాముల హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking