భక్తి శ్రద్ధలతో రంజాన్‌ ప్రార్ధనలు

భక్తి శ్రద్ధలతో రంజాన్‌ ప్రార్ధనలు

పినపాక అక్షిత ప్రతినిధి:

పినపాక మండలంలో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈద్గాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పిల్లా పెద్దా అనే తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి ఈద్గాల కొచ్చి ప్రార్థనలు జరిపారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. చాలా మంది ముస్లింలు నూతన వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో అల్లాను ప్రార్థించారు.ఈ.బయ్యారం, జానంపేట, పినపాకలో రంజాన్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎస్సై నాగుల్ మీరా ఖాన్ ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking