మంత్రి పువ్వాడను మర్యాదపూర్వకంగా కలిసిన దళితరత్న అవార్డు గ్రహీత కొరిపల్లి
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
తనకు దళితరత్న అవార్డు దక్కడం పట్ల మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దళిత రత్న అవార్డు గ్రహీత కొరిపల్లి శ్రీనివాస్ శనివారం రాష్ట్ర రావణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిని విడివోస్ కాలనీ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొరిపల్లి శ్రీనివాస్ కి శాలువాకప్పి పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించరు.కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ పేద సామాన్య ప్రజల పక్షాన మరియూ బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి దళితరత్న అవార్డును ప్రధానం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి అందుకు సహకరించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర రాజధానిలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించి తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును నామకరణ చేసినందుకు ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర రావుకి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా జిల్లా కమిటీ నాయకులు గొల్లమందల నరసింహారావు కనకపుడి వీరస్వామి మాదిగ సక్కుర్తి కోటేశ్వరావు మాదిగ దుప్పపల్లి శ్రీను మాదిగ జంగం వెంకయ్య మాదిగ జరిపోతు నరేష్ మాదిగ కొల ప్రభాకర్ మాదిగ బంక వెంకన్న మాదిగ గంగు బుడగ జంగం కలకోటి నాగేశ్వరరావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.