24 న ఖమ్మంలో రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలి -టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు

24 న ఖమ్మంలో రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలి

-టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఈ నెల 24 న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మం లో జరిగే నిరుద్యోగ సమస్య పై జరిగే కార్యక్రమానికి హాజరవుతున్నారని మండల ప్రజలు అత్యదిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
నిన్న బోదుల బండలో సమావేశంలో మాట్లాడూతూ పొన్నెకల్ నుంచి భారీ బైక్ ర్యాలీతో రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలకలన్నారు.


పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని రాయల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదల కష్టాలు తీరుతాయన్నారు.
అకాల వర్షం తో తడిచిన ధాన్యం మొక్కజొన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కేసీఆర్ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు మూడువేల నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదని విమర్శించారు.పేపర్ లీకేజీ ఘటన లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. కోచింగ్ సెంటర్ లలో లక్షల రూపాయల తో కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులకు పేపర్ లీకైన కారణంగా నష్టపరిహారం మూడు లక్షల రూపాయల చెల్లించాలని రాయల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బోడ్డు బోందయ్య, పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రాయపూడి నవీన్ జెర్రిపోతుల సత్యనారాయణ బోదులబండ ఎంపిటిసి కట్టెకోల సుధాకర్ కట్టెకోల నాగేశ్వరరావు గోపి ఉపేందర్ జిల్లేపల్లి నాగేశ్వరరావు గుడిబోయిన వెంకటేశ్వర్లు సూరేపల్లి రవి నాగార్జున మక్తాల రామక్రిష్ణ నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు యాతాకుల శ్రీనాధ్ కుక్కల నరేష్ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

రంజాన్ శుభాకాంక్షులు తెలిపిన రాయల

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ లో టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు పర్యటించారు. రంజాన్ పండుగ సందర్భంగా పాలేరు నియోజకవర్గం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.నేలకొండపల్లి మండల ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు షేక్ ఖాజా గ్రామ ముస్లీం సోదరులతో అలింగనం చేసుకోని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.వారి ఇంటి వద్ద ఇచ్చిన విందులో పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking