మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలెక్క‌డ‌…? -కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఎక్క‌డ‌..? -మ‌హ‌మ్మ‌ద్ జావేద్‌ ఖ‌మ్మం న‌గ‌ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు

మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలెక్క‌డ‌…?

-కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఎక్క‌డ‌..?

-మ‌హ‌మ్మ‌ద్ జావేద్‌
ఖ‌మ్మం న‌గ‌ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు

ఖ‌మ్మం/ అక్షిత బ్యూరో :

దేశం 10 ఏళ్లుగా ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య నిరుద్యోగం. కేంద్రంలో బీజేపీ న‌రేంద్ర మోడీ రాష్ట్రంలో టీఆర్ఎస్ కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక నియామ‌కాలు పూర్తిగా నిలిచిపోయాయి. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామ‌ని మోడీ.. ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని కేసీఆర్ ప్ర‌జ‌ల్ని భ్ర‌మ‌ల్లోకి నెట్టారు.బీజేపీ టీఆర్ఎస్ ప్ర‌భుత్వాలు వ‌చ్చాక కొత్త ఉద్యోగ ఉపాధి క‌ల్ప‌న దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు ఉపాధి మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి.గ‌త తొమ్మిదిన్న‌ర సంవ‌త్స‌రాలుగా దేశంలోనూ రాష్ట్రంలోనూ కొత్త‌గా స్థాపించిన ప‌రిశ్ర‌మ‌లు ఉత్పాద‌క రంగ సంస్థ‌లు ఏమీలేవు. ఇవి లేక‌పోగా కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు పారిశ్రామి ఉత్పాద‌క‌ ఉత్ప‌త్తి రంగాల‌ను వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేసింది. దేశానికి ఆర్థికంగా ఊత‌మిచ్చే సేవారంగాన్ని అత్యంత శ‌క్తివంతంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు తీర్చిదిద్దాయి.అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించేలా వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేసింది. ఈ రెండు ప్ర‌భుత్వాలు వ‌చ్చాక వ్య‌వ‌స్థ‌ల‌ను విధ్వంసం చేయ‌డంతో పాటు ప్రైవేటీక‌ర‌ణ పేరుతో రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ ను కుట్ర పూరితంగా ఎత్తేస్తున్నాయి. ఉద్యోగాలు లేకుండా చేయడంతో పాటు.. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు వ‌ర్తించే రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ ను తీసేసి.. ఆర్థికంగా, సామాజికంగా అణ‌గ‌దొక్కేందుకు చేస్తున్న కుట్ర‌ను అమ‌లు చేస్తున్నాయి.బీజేపీ కేసీఆర్ లు అనుస‌రిస్తున్న విధ్వంస విధానాల వ‌ల్ల ఇప్పుడిప్పుడే ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతున్న అట్టుడుగ వ‌ర్గాల‌న్నీ మ‌ళ్లీ పూర్తిగా 50 ఏళ్ల‌కింద‌టి ప‌రిస్థితుల్లోకి జారుకుంటున్నాయి.దేశాభివృద్ధి ఊత‌మివ్వ‌డంతో పాటు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్ని ముందుకు న‌డిపించాల్సిన ప్ర‌భుత్వాలు.. కొన్ని వ‌ర్గాల‌కు మాత్ర‌మే ద‌గ్గ‌ర‌తీస్తూ మిగిలి జాతుల్ని అణ‌గదొక్కేస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో నిరుద్యోగుల కోసం, వెన‌కుబ‌డ్డ సామాజిక వ‌ర్గాల రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ ను క‌చ్చితంగా అమ‌లు చేసేలా నిరుద్యోగ గ‌ర్జ‌న నిర్వ‌హించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల కోసం, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించేలా ఉద్య‌మిస్తోంది.నాడు 120 కోట్ల జ‌నాభా ఉన్న స‌మ‌యంలోనే ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డంతో పాటు.. స్వ‌యం ఉపాధి మార్గాల‌ను కూడా ఏర్పాటు చేసి ఆర్థిక సాధికార‌త‌కు బాట‌లు చేసింది కాంగ్రెస్.నిరుద్యోగుల కోసం ఖ‌మ్మం న‌గ‌రంలో కాంగ్రెస్ పార్టీ న‌గారా మోగిస్తోంది. ఈ నెల 24న నిరుద్యోగ స‌భ‌ను కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హిస్తోంది. ఈ స‌భ‌లో నిరుద్యోగులు ఉద్యోగ‌ ఉపాధి కోల్పోయిన యువ‌త‌ త‌ల్లిదండ్రులు పెద్ద ఎత్తున త‌ర‌లి రావాల‌ని కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పిలుపునిస్తున్నాం. మ‌ళ్లీ 2023-24లో అధికారంలోకి వ‌స్తే యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డంతో పాటు నిరుద్యోగ భృతిని ఏర్పాటు చేసి ఆదుకుంటాం. జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసి నియామ‌కాలు చేప‌డ‌తాం. కాంగ్రెస్ చెప్పిందంటే చేస్తుందంతే ఇది మాట కాదు. గ‌తం చెప్పే స‌త్యం.పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేయబోవు నిరుద్యోగ నిరసన దీక్ష విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking