ట్రాయి సభ్యురాలుగా కొనసాగనున్న కల్లెపు శోభారాణి
వరంగల్,అక్షిత బ్యూరో : హనుమకొండ మండల కేంద్రానికి చెందిన శ్రీ ధరణి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కల్లెపు శోభారాణి ని తెలంగాణ రాష్ట్రానికి రెండవసారి ట్రాయ్ సభ్యురాలిగా ఎన్నిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గత రెండేళ్లుగా సమస్యల పైన స్పందించి బాధితులకు తగిన న్యాయం చేస్తూన్నందుకు ఈ పదవి కాలంలో రెండేళ్ల పాటు కొనసాగేందుకు సహకరించిన ట్రాయ్ అధికార వర్గాలకు శోభారాణి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.