టీడీపి పార్టీ స్థలాన్ని పరీశీలించిన నగర నాయకులు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరం రెండో డివిజన్ లో పార్టీ ఆఫీస్ కోసం పాండురంగాపురం లో ఎన్టీఆర్ 1985 లో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో పేద ప్రజలకు కేటాయించబడిన క్వార్టర్స్ మధ్యలో పార్టీ ఆఫీస్ కొరకు స్థలాన్ని కేటాయించారు.ఆ స్థలంలో పార్టీ దిమ్మెను గతంలో ఏర్పాటు చేశారు.ఆ స్థలాన్ని నగర కోఆర్డినేటర్ వడ్డేం విజయ్ ఆధ్వర్యంలో పరిశీలించారు. త్వరలో ఆ స్థలంలో ఆఫీసు నిర్మాణం చేపట్టాలని ఆ డివిజన్ నాయకులు ఇటీవల ఖమ్మం పార్లమెంట్ అబ్జర్వర్ కూరపాటి వెంకటేశ్వర్లు కి విన్నవించిన సందర్భంగా నిన్న పరిశీలించారు.పరిశీలించిన వారిలో టిడీపి జిల్లా నాయకులు గుత్తా సీతయ్య డివిజన్ నాయకులు కృష్ణమాచారి నరసింహారావు గుడిపూడి నాగేశ్వరావు సౌలం లావణ్య తదితరులు ఉన్నారు.