దీర్ఘకాల ప్రజా యుద్ధ పంథాయె ఈ దేశ విముక్తికి మార్గం

దీర్ఘకాల ప్రజా యుద్ధ పంథాయె ఈ దేశ విముక్తికి మార్గం

వరంగల్,అక్షిత బ్యూరో : ఖిలా వరంగల్ లో జరిగిన సిపిఐ ఎంఎల్ పార్టీ 54వ ఆవిర్భావ దినోత్సవం.సిపిఎం నయా రివిజనిస్టు రాజకీయాలను వ్యతిరేకిస్తూ భూస్వామ్య దళారీ సామ్రాజ్యవాద అనుకూల దళారి నిరంకుశ పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా జరిగే సాయుధ వ్యవసాయక విప్లవం ద్వారానే ఈ దేశ ప్రజలకు నిజమైన స్వాతంత్రం స్వేచ్ఛ లభిస్తుందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గంగుల దయాకర్ అన్నారు.

ఈరోజు సిపి ఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు రష్యా విప్లవ నేత కామ్రేడ్ వీఐ లెనిన్ 153 వ జయంతిని నగరంలోని ఖిలా వరంగల్ పడమరకోట చమన్ సెంటర్లో న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో జరిపారు.

న్యూ డెమోక్రసీ నాయకులు రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు జండా ఎగరవేశారు . దేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూస్వామ్య సామ్రాజ్యవాద అనుకూల ప్రభుత్వాలేనని పీడిత ప్రజల జాతుల విముక్తి కోసం నూతన ప్రజాస్వానికి విప్లవమే ఏకైక మార్గమని ఆయన తెలిపారు

ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా నాయకులు గండ్రాతి హరిబాబు ఆర్ కృష్ణ మైదం సంజీవ ఎండి అక్బర్ ఇనుముల కృష్ణ కుమారస్వామి పాపయ్య సాంబయ్య గన్నారపు రాజేందర్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking