రంజాన్ వేడుకల్లో పాల్గొన్న – జడ్పిటిసి ఏవి రెడ్డి
– రైతుబంధు కన్వీనర్ రవీందర్ రెడ్డి
నాంపల్లి, అక్షిత న్యూస్:
పవిత్ర రంజాన్ పర్వదిన్నాన్ని పురస్కరించుకొని మండలంలోని పసునూరు, మండలం పసునూరు, గ్రామాలలో శనివారం ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల జడ్పీటీసీ ఏవి రెడ్డి, రైతు బంధు సమితి కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పవిత్ర రంజాన్ ప్రత్యేక పార్థనలో ముస్లింలతో కలిసి ప్రార్ధనలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరి, సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రంలోని మసీద్ వద్ద మత పెద్దలతో కలిసి ఎస్కె. చాందు పాషా, బంధువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది.అదేవిధంగా మండలంలోని పసునూరు గ్రామంలో స్థానిక కో ఆప్షన్ సభ్యులు ఎస్కె. అబ్బాస్ తన సొంత ఖర్చులతో చలివేంద్ర కేంద్రం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి మండల జడ్పీటీసీ ఏవి రెడ్డి, రైతుబందు సమితి కన్వీనర్ రవీందర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి చలివేంద్రం ప్రారంభించారు. ఇందులో కో ఆప్షన్ సభ్యులు ఎస్కె. అబ్బాస్,జానీ, వెంకటయ్య గౌడ్, జింకల నరేష్, మాధవ రెడ్డి ఉన్నారు.