పుడమిని పూజించు పర్యావరణాన్ని రక్షించు..

నకిరేకల్ ,అక్షిత ప్రతినిధి:

సకల జీవరాశులకు మానవాళికి ఆధారమైన భూమి పట్ల బాధితులతో ప్రతి పౌరుడు మెలగాలని పుడమిని కాపాడినప్పుడే అది మనల్ని కాపాడుతుందని , ఈ భూమిపై మనమే చివరి తరం కాకూడదు రాబోయే తరాలకు దీనిని సజీవ నివాసయోగ్యమైన గ్రహంగా అందించడమే ప్రథమ కర్తవ్యం కావాలని సామాజిక కార్యకర్త వేముల సైదులు అన్నారు.

శనివారం రోజున కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో  కక్కిరేణి గ్రామంలో ఏప్రిల్ 22 ప్రపంచ దరిత్రి దినోత్సవం సందర్భంగా ఉపాధి కూలీల వద్దకు వెళ్లి భూమిని కాపాడుకుందాం..

చెట్లను పెంచుదాం… పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేద్దాం..

రాబోయే భావితరాలకు ఆదర్శం అవుదాం అంటూ.. దరిత్రి భూమి యొక్క ఆవశ్యకతను గుర్తించి వారిచే ప్రతిజ్ఞ చేయించిన అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం , పుడమి తల్లిని పూజించాలని భూమి చేయు మేలు మరియు తదితర అంశాలపై అవగాహన   కలిగించడం జరిగింది .

కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనే సంస్థ ఏర్పడి 13 సంవత్సరాలైనా నేటికీ 11 లక్షల మంది విద్యార్థులతో 36 లక్షల మొక్కలు నాటించి సంరక్షించడం జరిగిందని వారన్నారు .

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చెరుకు గోపమ్మ , ఫీల్డ్ అసిస్టెంట్ కన్నేబోయిన ఉదయశ్రీ , ఉపాధి కూలీలు కన్నబోయిన యాదయ్య , మేడబోయిన నరసింహ ,  బొడ వెంకట్ నరసింహ , చిల్ల మచ్చ గిరి, భగవంతు , సుమలత , సంధ్య , సత్తయ్య ,  పారిజాత,జయమ్మ , సునీత , పద్మ , కనకమ్మ , మారెమ్మ , తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking