అల్లా దీవెనలతో ప్రజలంతా కలిసి మెలిసి సుఖ సంతోషాలతో ఉండాలి దైవ ప్రార్థనలు, ఉపవాసదీక్షలు జీవనశైలిని మారుస్తుంది అందరికీ అల్లా దీవెనలు ఉండాలి ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

అల్లా దీవెనలతో ప్రజలంతా కలిసి మెలిసి సుఖ సంతోషాలతో ఉండాలి

దైవ ప్రార్థనలు, ఉపవాసదీక్షలు జీవనశైలిని మారుస్తుంది

అందరికీ అల్లా దీవెనలు ఉండాలి
ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ టౌన్ ,అక్షిత న్యూస్:

రంజాన్ పర్వదినోత్సవం ఆధ్యాత్మికతను పెంపోందిస్తుందని కోదాడ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శనివారం రంజాన్ పండుగ పర్వదినం సందర్బంగా కోదాడ పట్టణములోని సాలార్జంగ్ పేట ఈద్గా దగ్గర నమాజ్ అనంతరం ముస్లిం సోదరులందరిని కలిసి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కబ్రస్థాన్ లో 15.66 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రంజాన్‌ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని, ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశం మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని అన్నారు

ముస్లిం సోదర సోదరీమణులంతా రంజాన్‌ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ సర్వ మతాలకు అండగా ఉంటూ సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ వారి సర్వతోముఖాభివృద్దికి పాటుపడుతున్నారని తెలిపారు. అందులో భాగంగా ముస్లిం లకు షాది ముబారక్ గాని, రంజాన్ పండుగ రోజు బట్టలు పంపిణి మరియు ఇఫ్తారు విందు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి డి ఈ పిచ్చయ్య వార్డ్ కౌన్సిలర్ ఎస్ కే షఫీ బిఆర్ఎస్ నాయకులు అల్తాఫ్ హుస్సేన్ వెంపటి మధుసూదన్ రావు ఎస్కే నహీం చింతల నాగేశ్వరరావు మునీర్ మజాహర్ దొంగరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking