తొలి గృహలక్ష్మీ పథకం బుడగ జంగాలకే – మంత్రి హరీష్ రావు ◆ సిద్ధిపేట గరీబోళ్లకు అన్నీ సౌలత్ లు కల్పిస్తున్నాం. ◆ ప్రజా అవసరాలకు అను గుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ◆ బేడ,బుడగ జంగాలు 86 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు.
తొలి గృహలక్ష్మీ పథకం బుడగ జంగాలకే – మంత్రి హరీష్ రావు
◆ సిద్ధిపేట గరీబోళ్లకు అన్నీ సౌలత్ లు కల్పిస్తున్నాం.
◆ ప్రజా అవసరాలకు అను గుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది.
◆ బేడ,బుడగ జంగాలు 86 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు.
సిద్ధిపేట అక్షిత ప్రతినిధి :
తొలి గృహలక్ష్మీ పథకం బుడగ జంగాలకే ఇద్దామని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేటలోని గరీబోళ్లకు అన్నీ సౌలత్ లు కల్పించినట్లు, ప్రజా అవసరాలకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తెలిపారు.జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం బేడ, బుడగ జంగాల అర్హులైన లబ్ధిదారులు 86 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదోళ్లకు ఇళ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల నగదు అందిస్తామని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీ కాలనీ మంచి విలువైన భూమి, రాళ్లు, గుట్టలు మంచిగ చేసేందుకు దాదాపు 4 లక్షలు ఖర్చు అయ్యాయని వివరించారు. మీ కాలనీ లే అవుట్ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏదేమైనా మీరంతా సద్దితిన్న రేవు తలవాలని, నియత్ ఉంటే బర్కత్ ఉంటుందని చెప్పుకొచ్చారు. సిద్ధిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి చిన్నకోడూర్ వరకూ నాలుగు లేన్ల రహదారి, బట్టర్ ఫ్లై వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు, మీ కాలనీలో వార్డు బస్తీ దవాఖాన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మీ ఇళ్లు శుభ్రంగా ఉన్నట్లే., మీ గల్లీ, పట్టణం శుభ్రంగా బాగుండాలని ప్రతీ ఇంటి నుంచి చెత్తను వేర్వేరుగా చేసి ఇవ్వాలని కోరారు. బేడ, బుడగ జంగాలకు ప్లాట్లు చేయడంలో కృషి చేసిన అర్బన్ తహశీల్దార్ విజయ్ ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ మచ్చ విజిత-వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, మున్సిపల్ కౌన్సిలర్ బర్ల మల్లిఖార్జున్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.