చక్రధర్ గౌడ్ పై బిజెపి పార్టీ అధి ష్టానం వెంటనే చర్యలు తీసుకో వాలి
సిద్దిపేట అక్షిత ప్రతినిధి :
పార్టీ సిద్ధాంతాలు తెలియని వారిని పార్టీలో చేర్చుకోవడం ఏ రోజుకైనా పార్టీకి ముప్పే అని
సిద్దిపేట అర్బన్ మండల బిజెపి అధ్యక్షుడు నరసింహారెడ్డి, రూరల్ మండల అధ్యక్షుడు మల్లం గారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల బీజేపీలో చేరిన చక్రధర్ గౌడ్ తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ సిద్ధాంతాలు తెలియని వారిని పార్టీలో చేర్చుకోవడం ఏ రోజుకైనా పార్టీకి ముప్పే అన్నారు. రేపిస్టులని పార్టీలో చేర్చుకుని ఏం సందేశం ఇద్దామని అనుకుంటున్నారు. ధర్మాన్ని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్ముకున్న మాకు ఇలాంటి నీచులను పార్టీలో చేర్చుకోవడం తగదు, దురదృష్టకరం అన్నారు.
మా మండలంలో పార్టీ కార్యక్రమాలకు మాకు సమాచారం ఇవ్వకుండానే చక్రధర్ గౌడ్ ఇష్టారాజ్యంగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాడని మండిపడ్డారు.
పార్టీ నియమాల ప్రకారం జిల్లా అధ్యక్షునికి, మండల అధ్యక్షునికి, బూత్ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు కార్యకర్తలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఏవీ చక్రధర్ గౌడ్ పాటించడం లేదని అన్నారు. ఎమ్మెల్యే టికెట్ తనదే అని చెప్పుకుంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నాడని అన్నారు.
యువకులను మద్యం డబ్బులతో చక్రధర్ గౌడ్ ప్రలోభాలకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఇష్టా రీతిగా వ్యవహరిస్తున్న చక్రధర్ గౌడ్ పై బిజెపి పార్టీ నాయకులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
మరో రెండు రోజుల్లో చక్రధర్ గౌడ్ తీరు మార్చుకోకపోయినా, పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టకపోయినా మేము ఏ నిర్ణయమైనా తీసుకుంటామని అన్నారు. గ్రామానికి ఇద్దరికి జీతాలు ఇస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ 20 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలను పక్కన పెడుతున్నాడని తెలిపారు.
చక్రధర్ గౌడ్ ప్రవర్తన పై ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు సహా పలువురు పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చామని, అయినా చక్రధర్ గౌడ్ తీరు మారడం లేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు రమేష్ రెడ్డి, శ్రీనివాస్, ముబిన్ తదితరులు పాల్గొన్నారు.