రైతులు అధైర్య పడవద్దు
ధాన్యమంతా కొంటాం
కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
రైతులు అధైర్య పడవద్దని,ప్రతి రైతు ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లాలో ఆకాల వర్షం అక్కడక్కడా కురిసిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులు అంచనా వేయుటకు జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి,అదనపు కలెక్టర్ భాస్కర్ రావు లు కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు.జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి శనివారం నల్గొండ మండలం కంచన పల్లి గ్రామం లో ఐ.కె.పి.ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అధైర్య పడ వద్దని,ధాన్యం కొనుగోలు కు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా కల్పించారు. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు నల్గొండ మండలం చందన పల్లి రెడ్డి బావి పి. ఏ.సి.ఎస్ కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ తో పాటు,సీనియర్ అధికారులు డి.అర్.డి. ఓ.,డి.ఎస్. ఓ,డి.సి. ఓ,డి.యం.,సివిల్ సప్లై స్,అర్.డి. ఓ.లు తహశీల్దార్ లు పర్యటించి కొనుగోళ్ల కు ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో శుక్ర వారం రాత్రి ఆకాల వర్షానికి అక్కడక్కడా కొంత మొత్తం లో వరి ధాన్యం తడిసిందని అన్నారు.జిల్లాలో కొనుగోలు కేంద్రాల వారిగా ప్రతి నిత్యం కొనుగోళ్ళ పై సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు.కొనుగోలు కేంద్రం లలో ధాన్యం కొనుగోలు నుండి మిల్లు లకు పంపే వరకు ,మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసే వరకు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఏప్రిల్ 15 న యా సంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినట్లు తెలిపారు.రాష్ట్రం లో ఇప్పటి వరకు 1,27,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయగా,జిల్లాలో
ఇప్పటి వరకు 272 కొను గోలు కేంద్రాలు ప్రారంభించి 78,392 మెట్రిక్ టన్నుల ధాన్యం 9380 మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. ఆకాల వర్షాల నేపథ్యం లో మిల్లర్ లు,ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ లు, మిల్లర్ లతో సమావేశం ఏర్పాటు చేసి ఆకాల వర్షాల కారణంగా ధాన్యం కొనుగోలుకు సహకరించాలని కోరినట్లు తెలిపారు.వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు,
రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని,ధాన్యం సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతి రోజూ సరాసరి 10 వేల నుండి 12 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.