ప్లీనరీ గులాబీ మయమవ్వాలి
గులాబీ శ్రేణులకు బడుగుల పిలుపు
కోదాడ టౌన్, అక్షిత న్యూస్ : ఈనెల 25న కోదాడలో జరుగనున్న ప్లీనరీ గులాబీ మయమవ్వాలని రాజ్యసభ సభ్యులు జిల్లా అధ్యక్షులు బడుగు లింగయ్య యాదవ్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కోదాడ పట్టణంలో గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో ఈనెల 25న టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న ప్లీనరీని విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం కోదాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత ఆయా గ్రామాలలో పార్టీ శ్రేణులు వార్డుల వారీగా డప్పు వైద్యాలతో మామిడి తోరణాలతో గులాబీ జెండాను ఆవిష్కరించాలని జిల్లా అధ్యక్షుడు సూచించారు. అనంతరం 11 గంటలకు భారీగా ప్లీనరీకి తరలిరావాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం 9 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన పలు అభివృద్ధి అంశాలపై ప్లీనరీలో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.. రాష్ట్రంలో జరిగిన సంక్షేమ పథకాల అమలుపై పలువురు వక్తలు శ్రేణులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా రాష్ట్రాలలోని ప్రజలు టిఆర్ఎస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తమ రాష్ట్రాలలో కూడా అమలు జరగాలని ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. నాయకులు అప్రమత్తతతో ఎవరికి వారు శ్రేణులను ప్లీనరీకి స్వచ్ఛందంగా తరలివచ్చే విధంగా బాధ్యతగా తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు సుంకర అజయ్ కుమార్, శీలం సైదులు, కవితారెడ్డి, సత్యబాబు, ఆంజనేయులు, వెంకటేశ్వరరావు, బట్టు శివాజీ, తుమ్మలపల్లి భాస్కర్, చందు నాగేశ్వరరావు, బెజవాడ శ్రవణ్వే నేపల్లి వెంకటేశ్వరరావు, గుంజుపల్లి రమేష్, సత్యవతి ఎస్ కె నహీం, ముస్తఫా, కాట్రగడ్డ ప్రసాద్ రెడ్డి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.