బీసీ జర్నలిస్ట్స్ సమస్యల సాధనకు పోరు

బీసీ జర్నలిస్ట్స్ సమ్మేళనం

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
బీసీ సమాజ్ అధ్యక్షులు సంఘం సూర్యారావు, కార్యనిర్వక అధ్యక్షులు నాగ పరిమళ, ఉపాధ్యక్షులు పెద్దబుద్ధుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్ లోని మోక్షగుండా విశ్వేశ్వరయ్య భవనంలో నిర్వహించిన బీసీ జర్నలిస్ట్ సమ్మేళనం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు సీనియర్ జర్నలిస్టులు హాజరయ్యారు, ఈ సమావేశంలో భవిష్యత్తులో చేపట్టబోయే కార్డియాచలనపై సలహాలను సూచనలను తెలియజేశారు. బిసి జర్నలిస్ట్ సమ్మేళనానికి కూకట్పల్లి నుంచి విద్యా వెంకట్ ఆధ్వర్యంలో పలువురు బిసి జర్నలిస్టులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కూకట్ పల్లి సీనియర్ జర్నలిస్ట్ తొట్ల పరమేష్ గౌడ్ మాట్లాడుతూ బీసీ జర్నలిస్టులు ఒకే వేదిక పైకి వచ్చి ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడం అభినందనీయం. ఇలాంటి సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా మరెన్నో ఏర్పాటుచేసి జర్నలిస్టుల అభ్యున్నతికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీసీలు ఐక్యంగా అంటే రాజ్యాధికారం చేపట్టవచ్చున్నారు. కార్యక్రమంలో కూకట్ పల్లి బీసీ జర్నలిస్టులు నామాల శ్రీధర్ గౌడ్, తేళ్ల హరికృష్ణ పటేల్, ప్రభాకర్ గౌడ్, కైలాష్ సంగిశెట్టి, రాము యాదవ్, దాదే వెంకట్ పటేల్, శ్రీకాంత్ గౌడ్, రాజు యాదవు, శంకర్ యాదవ్, దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking