వివేరా గ్యాస్ట్రో సెంటర్ ను ప్రారంభించిన.. సిఎస్ నర్సింగరావు, మాజీ డిజిపి మహేందర్ రెడ్డి..
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
కూకట్‌పల్లి కె.పి.హెచ్.బి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వివేరా గ్యాస్ట్రో సెంటర్ ను ఆదివారం తెలంగాణా సియం ప్రధాన కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, మాజీ డిజిపి యం. మహేందర్ రెడ్డిలు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాస్ట్రోఎంటరోలజీ రంగంలో పేరెన్నికగన్న డా.గిరిధర్ రెడ్డి ఈ ఆసుపత్రిని స్థాపించడం సంతోషంగా ఉందని అన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందించటమే లక్ష్యంగా ముందుకు సాగాలని, అత్యాధునిక చికిత్స విధానంతో ఈ ఆసుపత్రిలో వైద్య సేవలను అందించనున్నారని తెలిపారు.నేటి కాలంలో జీర్ణ సంబంధమైన రోగాల బారిన అనేక మంది పడుతున్నారని, రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అత్యున్నత సాంకేతికతను ఉపయోగించి చికిత్స అందించనున్నామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణా సియం ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ డాక్టర్ ఎస్ నర్సింగరావు, తెలంగాణ రాష్ట్ర మాజీ డిజిపి డా.యం. మహేందర్ రెడ్డి, వివేరా గ్యాస్ట్రో సెంటర్ వ్యవస్థాపకుడు డాక్టర్ బి గిరిధర్ రెడ్డి, డాక్టర్ ప్రతాప్ రెడ్డి, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి, ఐఏఎస్ అధికారి నాగిరెడ్డి, జేఎన్టీయూ విసి కట్ట నరసింహ రెడ్డి, జేఎన్టీయూ కోఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.