జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

శేరిలిగంపల్లి, అక్షిత ప్రతినిధి:
శేరిలిగంపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 300 మందికి పైగా చిన్నపిల్లలకి, వృద్ధులకు పాల్గొన్నగా వారికి వైద్యుల పర్యవేక్షణలో రక్త పరీక్షలు చేసి మందుల పంపిణీ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో డాక్టర్ మాధవ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి, పార్టీ బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ మురళీకృష్ణ,డాక్టర్ కామేశ్వరి,దాక్షాయిని,సత్య,భారతి,శ్రవణ్,సందీప్,సూర్య,అరుణ్,అశోక్,చిరంజీవి,వీర వెంకట్,రామ్ సాయి,ప్రవీణ్,ప్రసాద్,గణేష్,జాషువా,రాజేష్,ప్రదీప్,రవి,మున్నా,రవి తేజ,కిరణ్ ఇతర జనసేన నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking