25న” మిర్యాల” గులాబీ ప్లీనరీ

ఎల్లుండి నియోజకవర్గ స్థాయి

ప్లీనరీ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం
*పార్టీ శ్రేణులకు దిశా,నిర్దేశం 

ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ సమావేశాన్ని ఈనెల 25న మిర్యాలగూడ పట్టణంలోని శ్రీమన్నారాయణ గార్డెన్స్ పంక్షన్ హాల్ లో నిర్వహించనున్న శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన దిశా, నిర్దేశం చేశారు.

అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ జెండాలను అవిష్కరించాలని కోరారు. మిర్యాలగూడ పట్టణంలోని అన్ని వార్డుల కౌన్సిలర్లు, పార్టీ ఇంఛార్జీలు, పార్టీ వార్డు అధ్యక్షులు కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించాలని కోరారు. సిఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి విస్తృత ప్రచారం చేపట్టాలని, ఆయా వార్డు ప్రజలకు వివరించాలన్నారు. తొమ్మిదేండ్లలో మిర్యాలగూడ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని భాస్కర్ రావు సూచించారు. మిర్యాలగూడలో చేపట్టిన మినీ రవీంద్ర భారతీ నిర్మాణం, సాగర్ రోడ్డు విస్తరణ, అన్ని కమ్యూనిటీ సంఘాలకు కమ్యూనిటీ హాళ్లు, ఏరియా ఆస్పత్రి పునరుద్ధరణ 200 పడకల నుంచి 300 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడేషన్, రాజీవ్ చౌక్ నుంచి వై జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ, చింతపల్లి బైపాస్ రోడ్డు పనుల గురించి అవగాహన కల్పించాలని కోరారు. నియోజకవర్గ స్థాయి ప్లీనరీని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా క్రమశిక్షణ, నిబద్దత, అంకిత భావంతో పని చేయాలని భాస్కర్ రావు సూచించారు. సమావేశంలో టీఎస్ ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జునచారీ, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ, జిల్లా మైనారిటీ నాయకులు షేక్ మధార్ బాబా, ఖాజా మోహినోద్దీన్, ఉదయ భాస్కర్, మలగం రమేష్, సాధినేని శ్రీనివాస్ రావు, పత్తిపాటి నవాబ్, శ్రీధర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, మాజిద్, వీరారెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking