మున్నూరు కాపుల ఆధ్వర్యంలో ర్యాలీ
వరంగల్,అక్షిత బ్యూరో : మున్నూరు కాపు యువజన విభాగాన్ని తెలంగాణలోని అన్ని జిల్లాలో ఏర్పాటుచేసి బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ అన్నారు. హనుమకొండ మున్నూరు కాపు సంఘం కార్యవర్గ ఎన్నిక సందర్భంగా వరంగల్ నగరంలోని వివేకనంద జూనియర్ కాలేజ్ నుండి హనుమకొండ మాతా గార్డెన్ వరకు వరంగల్ జిల్లా యువజన అధ్యక్షుడిగా ఎన్నికైన కొరివి పరమేష్ చేపట్టిన. ర్యాలీ దేవయ్య ప్రారంభించి ఇప్పటివరకు తెలంగాణలోని అన్ని జిల్లాలలో మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీలు ఏర్పాటు చేశామని ఇప్పుడు యువజన విభాగాన్ని బలోపేతం చేసేందుకు అన్ని జిల్లాలు పర్యటించి నూతన యువజన జిల్లా కమిటీలు ఏర్పాటు చేయనున్నామని, దీంతో మున్నూరు కాపు సంఘం బలోపేతం అవుతుందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రెటరీ బండి కుమార్ స్వామి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కటకం పెంటయ్య, మున్నూరు కాపు నాయకులు రాజనాల శ్రీహరి, హరి శంకర్, పెరుకారి శ్రీధర్, కనుకుంట్ల రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.