విద్యార్థులకు కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ల పంపిణీ..

విద్యార్థులకు కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ల పంపిణీ..

అక్షిత న్యూస్, లింగాల;

విద్యార్థులకు కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ల పంపిణీ..
క్రై సౌజన్యంతో శ్రామిక వికాస కేంద్రం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంబటిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కంప్యూటర్ కోర్సు కు సంబంధించిన ఉత్తీర్ణత సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమం సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది.

కార్యక్రమానికి హాజరై మాట్లాడిన శ్రామిక వికాస కేంద్ర, నాగర్ కర్నూల్ సిడబ్ల్యూసి చైర్మన్ లక్ష్మణరావు మాట్లాడుతూ భవిష్యత్తు అంతా టెక్నాలజీ పై ఆధారపడి ఉంటుంది కావున ప్రతి విద్యార్థి కంప్యూటర్ విద్య అభ్యసించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు.. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ నాగ రవిశంకర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు శ్రీ జంబుల హనుమంత్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తహర్ పాషా, ఎస్ వి కే మండల కోఆర్డినేటర్ ఎండి మన్సూర్, ఉపాధ్యాయ బృందం మరియు స్టెమ్ టీచర్లు శ్రీవాణి, ఐశ్వర్య కమ్యూనిటీ ఆర్గనైజర్ శ్రీశైలం, గ్రామ యువకులు భూపాల్ రాజు,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking