అకాల వర్షానికి కోదాడ లో భారీగా దెబ్బతిన్న మామిడి తోటలు వడగండ్ల వాన రాళ్లతో పగిలిపోయిన మామిడికాయలు పండ్ల తోటల రైతుల కు వెంటనే నష్టపరిహారం అందించాలి బిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు
అకాల వర్షానికి కోదాడ లో భారీగా దెబ్బతిన్న మామిడి తోటలు
వడగండ్ల వాన రాళ్లతో పగిలిపోయిన మామిడికాయలు
పండ్ల తోటల రైతుల కు వెంటనే నష్టపరిహారం అందించాలి
బిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు
కోదాడ టౌన్ అక్షిత న్యూస్:
ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు ,మామిడి తోటలు భారీగా దెబ్బతిన్నాయని బి ఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ ఏర్నేని వెంకటరత్నం బాబు అన్నారు.కోదాడ పరిధిలోని దొరకుంట సమీపంలో గల 60 ఎకరాల తన తోటలో, నిన్న సాయంత్రం ఈదురు గాలులకు పూర్తిస్థాయిలో బంగినపల్లి, హిమాయత్ చిన్న రసాలు ,పెద్ద రసాలు వడగండ్ల వాన రాళ్లకు పగిలి పనికిరాకుండా పోయాయని వారు తెలిపారు.సంబంధిత అధికారులు పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని పండ్ల రైతులను ఆదుకోవాలని వారు కోరారు.

తన సొంత 60 ఎకరాల మామిడి తోటలో సుమారు 20 నుంచి 25 లక్షల నష్టం వాటిల్లుతున్నదని వారు తెలిపారు.చేతికొచ్చిన పండ్లతోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రభుత్వం వారిని గుర్తించి పండ్ల రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు.