పైలేరియా బాధితులు కిట్స్ సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ జనార్దన్ రెడ్డి

పైలేరియా బాధితులు కిట్స్ సద్వినియోగం చేసుకోవాలి

సర్పంచ్ జనార్దన్ రెడ్డి

మద్దూరు అక్షిత న్యూస్:

దోమ కాటుతో బాధ పడుతున్న బాధితులు ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేసిన కిట్స్ సద్వినియోగం చేసుకోవాలని మద్దూరు గ్రామ సర్పంచ్ కంటరెడ్డి జనార్ధన్ రెడ్డి సూచించారు.సోమవారం మద్దూరు ప్రాదమిక అరోగ్య కేంద్రం వైద్యాధికారి రజిత ఆధ్వర్యంలో పైలేరియా బాధితులకు కిట్స్ పంపిణి చేశారు.ఈ సందర్బంగా అమే మాట్లాడుతూ ఉకరెరియ బ్రంక్రాఫ్ట్ అనే పరాన్న జీవి ద్వార కలుగుతుందన్నారు.ఈ వ్యాధి క్యులెక్స్ దోమ కాటు ద్వార ఒకరి నుండి మరొకరికి వ్యాప్తిస్తుంది.దోమ కుట్టిన తర్వాత సంవత్సరమునకు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ దోమలు సాధారణంగా మన ఇంటి చుట్టూ ఉండే మురుగునీటిలో మరియు సెప్టిక్ ట్యాంకులో దోమలు పెరగడానికి కారణం అవుతాయి. ఈ దోమలు సాయంత్రం 6:00 నుండి ఉదయం 6 గంటల వరకు కుడుతాయి.

వ్యాధి లక్షణాలు:

తరచూ వచ్చే వ్యాధి కొద్దిపాటి జ్వరం మరియు ఆయాసం శోషనాళాలు పాడైపోయి లింపు ప్రసరణలు ఆగిపోయి కాళ్లు చేతులు కాపు రావడం వాటి చర్మంపై పుండ్లు నీరు కారడం,దురద పెట్టడం, మర్మవయలు పాడవడం, గజ్జల్లో,సంకలలో బిల్లలు కట్టడం ఈ వ్యాధి లక్షణాలు.

నివారణ చర్యలు:

వాడిన నీటిని, మురుగు నిటి వ్యవస్త ద్వారా, పారుదలకు ఏర్పాటు చేసుకోవాలి. నీటిలో దోమలు వృద్ధి చెందకుండా లార్వి సైడ్ మందులను స్ప్రే చేయాలి. దోమతెరలను వాడటం నీటి డ్రమ్ములలో నీరు వారం కన్నా నిల్వ ఉండకుండా చూడటం మొదలగు నివారణ చర్యలు పాటించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అరిఫ్,ఎంపీటీసి బొప్పె కనకమ్మ నాగయ్య, సి హెచ్ ఓ శేషగిరి,సీనియర్ అసిస్టెంట్ సుధయ్య, హెచ్ ఏ రఘు,సూపర్వేజార్ హేమలత, రేఖ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking