వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ మాజీ ఐపీఎస్ బరిలోకి,..?
ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:
మాజీ ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో నెంబర్ 1 అసెంబ్లీ స్థానమైన సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు తీవ్ర ఆలోచన చేస్తున్నారని సమాచారం. గత కొంతకాలంగా ఆయన తరచూ ఆ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పార్టీ శ్రేణులను సమాయత్తపరిచారన్న సమాచారముంది.