చినుకులతో రైతుల చిత్తడి

రైతన్న ఆగమాగం..!
ఎగుమతికి రాని లారీలు…!!
కాంటాలకు నోచుకోని ధాన్యం…!!!
నెలరోజులు దాటినా అమ్మకానికి ఎదురుచూపులు…!!!!

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అమ్మకానికి నోచుకోక రైతన్న ఆగమాగం అవుతున్నాడు.మరో వైపు ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు తరలించడానికి లారీలు రాకపోవడంతో నెలల తరబడి ధాన్యం రాసులు కల్లాల వద్దే వుంటున్నాయి.ఇంకో వైపు ఆకాశంలో గత రెండు రోజుల నుండి మబ్బులు పడుతుండడం రైతన్నను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ఆడపడదప పడుతున్న చినుకులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పండిన దాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామన్న అధికారులు, పాలకుల హామీ అమలుకు నోచుకోవడం లేదు. త్రిపురారం మండలం లచ్యతండ గ్రామ పంచాయతీలో నెల రోజులకు పైగా ధాన్యం అమ్మకానికి వచ్చి ఐకేపీ కేంద్రంలో రాసులుగా పడివున్నా చూసే దిక్కు లేదు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్న ఆకాశం వైపు చూస్తు పాలకులపై దుమ్మేతి పోస్తున్నారు.

లచ్యతండాలో ఏర్పాటు చేసిన కేంద్రంలో 15000 బస్టాల వరకు ధాన్యం రాసులు ఉండగా 2000 బస్టాల కాంట వేసిన బస్తాలు తరలించడానికి లారీలు రాక కేంద్రంలోనే పడివున్నాయి. మరో వైపు కాంటాలు వేసిన ధాన్యం గత మూడు రోజుల క్రితం తడవడంతో మొలకలు వచ్చాయి.

ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణం ధాన్యం కాంటాలు వేసి తరలించే ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో రైతులు భారి మొత్తంలో నష్ట పోయే ప్రమాదం వున్నది.

Leave A Reply

Your email address will not be published.

Breaking