ఐఅండ్ పిఆర్ స్పెషల్ కమీషనర్ గా అశోక్ రెడ్డి

*సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన అశోక్ రెడ్డి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా కోరం అశోక్ రెడ్డి నేడు భాద్యతలు స్వీకరించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సం సందర్బంగా రెండవ అంతస్తులోని తన సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి కార్యాలయంలో మధ్యాహ్నం 1.50 గంటల ప్రాంతంలో భాద్యతలు స్వీకరించారు.


ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సమాచార, పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ గా, రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా, E.O. కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించిన అశోక్ రెడ్డిని సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, కె.వెంకట రమణ, డిప్యూటీ డైరెక్టర్లు మధుసూదన్, హష్మీ, సి.ఐ.ఇ రాధాకిషన్, ఆర్.ఐ.ఇ జయరాంమూర్తి, ఎఫ్.డి.సి. ఇ.డి కిషోర్ బాబు తదితరులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking