సచివాలయంలో రెండో రోజు మంత్రి కొప్పుల ఈశ్వర్ బిజీ బిజీ
తన శాఖా ఫైల్స్ పై సంతకాలు చేసిన మంత్రి
మంత్రి కొప్పుల ఈశ్వర్ కు పలువురు అభినందనలు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
రాష్ట్ర ఎస్సి అభివృద్ధి సంక్షేమ శాఖా మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ సోమవారం ఉదయం 10 గంటలకు సచివాలయం లోని తన ఛాంబర్ చేరుకున్నారు. తన శాఖలకు సంబంధించిన ఫైల్స్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతకాలు చేశారు.

ప్రభుత్వ చీఫ్ విప్ భాను ప్రసాద్.రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, జగిత్యాల జిల్లా జేడ్పిటీసి సభ్యుడు బాధిని రాజేందర్, లోక పాపిరెడ్డి, ఎస్సి కార్పొరేషన్ ఎం.డి కరుణాకర్ తదితరులు మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి అభినందనలు తెలిపారు.