ఐఅండ్ పిఆర్ కమీషనర్ కు బొకే అందించిన చిన్న పత్రికల సంఘం నేతలు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఐఅండ్ పిఆర్ స్పెషల్ సెక్రెటరీ, కమీషనర్ కే. అశోక్ రెడ్డికి చిన్న పత్రికల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు దాస్ మాతంగి, యాతాకుల అశోక్, బాలకృష్ణలు పూలబొకే అందించారు.

ఐఅండ్ పిఆర్ స్పెషల్ సెక్రెటరీగా అశోక్ రెడ్డి నూతన సచివాలయంలో బాధ్యతలు స్వీకరించి సోమవారం తొలిసారిగా కమిషనర్ కార్యాలయంలోకి వచ్చారు. తొలుత కమీషనర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం శాఖ పరమైన అంశాలపై అధికారులతో సమీక్షించారు. తదుపరి చిన్న పత్రికల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అశోక్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు బి.వెంకటయ్య, గోళ్ల రమేష్, మీసాల నరహరి, అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.