ఉద్యమ వీరుడు “పల్లె”కు పట్టాభిషేకం

రాష్ట్ర గీత కార్పొరేషన్ చైర్మన్ గా             పల్లె రవికుమార్ గౌడ్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ఉద్యమ వీరుడు… పల్లె రవికుమార్ గౌడ్ కు ఎట్టకేలకు పట్టాభిషేకం కల్గింది. నాడు తెలంగాణ ఉద్యమంలో  తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జర్నలిస్టులను జాగృతం చేసిన ధీరుడు. ఉద్యమానికి ఊపిరిగా నిలిచారు. ఎట్టకేలకు సీఎం కేసిఆర్ గీత కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టిండ్రు.నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన పల్లె రవికుమార్ గౌడ్ కు గీత కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర గీతా కార్మికుల కో- ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ తొలి చైర్మన్ గా రవికుమార్ ను నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ఆదేశాలు జారీ చేశారు.రవికుమార్ జర్నలిస్ట్ నేతగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. జర్నలిస్టుగా వివిధ దినపత్రికలలో సుదీర్గ కాలం పని చేసిన రవి కుమార్ ఎన్నో అద్బుతమైన కథనాలు రాశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టులందరిని ఏకం చేసి పోరు బాట పట్టించారు.‌ 2001లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటులో కీలకంగా ఉన్న రవి‌కుమార్.. అన్ని పార్టీల నేతలు ఉద్యమంలోకి వచ్చేలా కష్టపడ్డారు. 2006లో నల్లగొండ జిల్లా చండూర్ లో దూo దాం నిర్వహించి అన్ని రాజకీయ పార్టీల అగ్రనేతలతో జై తెలంగాణ నినాదాలు చేపించారు. తెలంగాణ ఉద్యమంలో మైలురాయిగా నిలిచిపోయిన మిలియన్ మార్చ్, సాగర హారం, సకల జనుల సమ్మెలో జర్నలిస్టు నేతగా ముందు నిలుచారు. స్వరాష్ట్రంలోనూ బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ను గుర్తించి తనకు కార్పొరేషన్ పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రులు కేటిఆర్, శ్రీనివాస్ గౌడ్ లకు పల్లె రవికుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking