ఆదర్శ పంచాయితీగా తీర్చిదిద్దుతాం

ఆదర్శ పంచాయితీగా తీర్చిదిద్దుతాం

సర్పంచ్, వార్డు సభ్యుల ప్రతిన

అక్షిత న్యూస్, మాడుగులపల్లి :

పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి
మండలంలోనే ఆదర్శగ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ తునం శోభ అన్నారు. గురువారం నల్గొండ జిల్లా మాడుగులపల్లి  గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు గ్రామ సర్పంచ్ తూనం శోభ గ్రామ వార్డు మెంబర్ లతో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకునే విధంగా, ప్రతి గ్రామ అవార్డు మెంబర్లు చురుకుగా పాల్గొని గ్రామంలో జరగవలసిన అభివృద్ధి పనులను ఏమైనా మిగిలి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వార్డ్ మెంబర్లను కోరారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యంగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు నాతోపాటు ప్రతి వార్డు మెంబర్లు నడుంభిగించిన మండలంలోనే ఆదర్శగ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకుందామని అన్నారు. ఇప్పటికే గ్రామంలో వివిద అభివృద్ధి పనులు నిర్వహించడం జరిగింది. స్మశానవాటిక నిర్మాణం, డంపింగ్ యార్డు ఏర్పాటు, పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేశాం అని అన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు నిర్వహించి గ్రామాన్ని అన్ని విధాలుగా మండంలోనే అదర్శంగా తీర్చిదిద్దేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేందుకు తమవంతు కృషిచేస్తాం అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking