ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ప్రారంభం
-ప్రారంభించిన సుడా చైర్మన్ విజయ్ కుమార్
ఖమ్మం, అక్షిత ప్రతినిధి :
ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నందు ప్రొప్రైటర్ కార్తికేయ శ్రీనివాస్ లు నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ ఎక్స్పో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ హాజరై రిబ్బన్ కట్ చేసీ ప్రారంభించారు.అనంతరం నిర్వాహకులు ఏర్పాటుచేసిన 50 వేల రకాల అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ ఎక్స్పో స్టాల్స్ ను వీక్షించారు.ఈ సంవత్సరం వేసవి సెలవులలో పిల్లల ఆటల కొరకు ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేసిన వారి బృందాన్ని అభినందించారు. ఎగ్జిబిషన్ నందు చిన్న పెద్ద పిల్లల ఆటల వస్తువులు మరియు 50 రకాల వస్త్రాల దుకాణాలు స్టాల్స్ ఏర్పాటు చేయడం ఎగ్జిబిషన్ నేటి నుండి 40 రోజుల వరకు ఉంటుంది.ఎగ్జిబిషన్ సమయం ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది.కావున నగర ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పాలెపు విజయ వెంకటరమణ బుడిగం శ్రీనివాసరావు రాపర్తి శరత్ నాయకులు గౌరీనాథ్ జానీ ఎగ్జిమిషన్ నిర్వాహకులు కార్తికేయ శ్రీనివాస్ సంతోష్ అంజి వెంకటేష్ పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.