రిజర్వేషన్లు పితమహుడు సాహు మహారాజ్

రిజర్వేషన్లు పితమహుడు
సాహు మహారాజ్

జాడి రాజు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

భారతదేశానికి స్వాతంత్రం రాకముందే అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం 50% రిజర్వేషన్ అమలుపరచిన మహాపురుషుడు చత్రపతి సాహు మహారాజు అని ప్రముఖ వైద్యులు డాక్టర్ జాడి రాజు అన్నారు. సాహూ మహారాజు 101వ వర్ధంతి సందర్భంగా శనివారం మిర్యాలగూడలో ఆయన చిత్రపటానికి పూలదండవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్బంధ విద్య కొరకు పాఠశాలలు,గ్రంథాలయాలను స్థాపించి ప్రజలను చైతన్య పరిచరన్నారు. అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అమలుతోబాటు మహిళలకు ప్రత్యేక హోదా ఇచ్చిన మహాపురుశుడని కొనియాడారు. రిజర్వేషన్ అమలు పరచని వారిని జైలుకు పంపిన వ్యక్తి సాహుమహారాజ్ అని పేర్కొన్నారు. అంబేత్కర్ కు విద్య కోసం సహాయం చేయడంతో పాటు రామాదేవి ఆరోగ్యం కోసం కృషి చేసిన త్యాగదనుడని చెప్పారు. కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోత్ దశరత్ నాయక్, విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మారం శ్రీనివాస్,ఎస్సీ ఉద్యోగుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ్గుల శ్రీనివాస్,కొత్త పల్లి బాబురావు, జయరాజు మట్టయ్య, మల్లయ్య, వినయ్,అడ్విన్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking