ఘనంగా ముత్యాలమ్మ జాతర

ఘనంగా ముత్యాలమ్మ జాతర

ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

అక్షిత ప్రతినిధి, మిర్యాలగూడ :

దామరచర్ల మండల కేంద్రంలో ముత్యాలమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు.జాతరలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జరిగిన మాను ఊరేగింపులో పాల్గొన్నారు,ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంసృతి సంప్రదాయాలకు ప్రతీక గ్రామ దేవతల జాతరలు అని అన్నివర్గాల ప్రజలు ఆనందంగా ఉండి ఈ ప్రాంతం సమగ్రమైన అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బందు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు హతిరం, రవితేజ, ఉర్దూ అకాడమి మాజీ డైరెక్టర్ ఎం.డి యూసుఫ్, పడిగపాటి పెదకోటిరెడ్డి,దారగాని వెంకటేశ్వర్లు,ఎంపిటీలు సోము సైదిరెడ్డి, బాలలక్ష్మీ సత్యనారాయణ,మండల కో ఆప్షన్ సభ్యులు నాగుల్ మీరా, మాజీ సర్పంచులు బైరం నర్సయ్య, గుగులోతు వీరబాబు, ఉప సర్పంచ్ సోమయ్య, కందుల నాగిరెడ్డి, పడిగపాటి శ్రీనివాస్ రెడ్డి, కొండారపు బ్రదర్స్, బైరం గోపి, నీరుకంటి శ్రీనివాస్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking