చెర్వుల జలకళతో…చేప సంపద పుల్

చెర్వుల జలకళతో

 చేప సంపద పుల్

 

మత్స్య పారిశ్రామిక కార్మికుల

సంక్షేమానికి ప్రభుత్వం కృషి     

      

భాస్కరుడికి  గజమాలతో

పందిరి సత్కారం 

 

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ  

 

ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు     

వేములపల్లి, అక్షిత ప్రతినిధి : 

మిషన్ కాకతీయతో చెర్వులు జలకళను సంతరించుకుని చేప సంపదను వృద్ది చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలోని మత్స్యకార సభ్యుల అభివృద్ధి సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు.

సోమవారం మండల కేంద్రంలోని వేములపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలోని మత్స్యకార సభ్యులకు మత్స్యశాఖ అందించిన గుర్తింపు కార్డులను శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు చేతుల మీదుగా సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వేములపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి పందిరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ముదిరాజులు, గంగపుత్రులు, తెనుగు, గౌండ్ల బెస్త,  ముతరాసి తెగలకు చెంది 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి  అర్హులుగా గుర్తించి సభ్యత్వం కల్పిస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల లబ్ది అర్హులందరికీ అందాలనేది ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమన్నారు. కోట్లాది రూపాయలను ఖర్చుచేసి ఉచితంగా చేపపిల్లలు,రొయ్య పిల్లలను పంపిణీ చేయడంతో పాటు మత్స్యకారులకు సబ్సిడీపై వివిధ రకాల వాహనాలను సైతం అందజేయడం జరుగుతుందని గుర్తుచేశారు. సంఘంలో సభ్యత్వం పొందిన ప్రతి సభ్యుడు  ప్రభుత్వ పంపిణీ చేసే చేపలు పట్టుకోవడానికి, చెరువులపై హక్కులు కల్పించడం జరుగుతుందన్నారు.అనంతరం వేములపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి పందిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ్యులతో కలిసి ఎమ్మెల్యే భాస్కర్ రావును గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ఇరుగు మంగమ్మ వెంకటయ్య, వేములపల్లి,మాడ్గులపల్లి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధిని, స్థానిక సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, ఉపసర్పంచ్ అమిరెడ్డి పద్మ శేఖర్ రెడ్డి , మాజీ మార్కెట్ డైరెక్టర్ పుట్టల భాస్కర్ ,పిఏసీఎస్ డైరెక్టర్ మాలి శంకర్ రెడ్డి, మండల పార్టీ జనరల్ సెక్రటరి దైద జాన్సన్, బిసి సెల్ మండల అధ్యక్షుడు ఉగ్గే మునీశ్వర్ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగవెల్లి శంకర్,పుట్టల పౌల్, లతీఫ్, గుర్రం శ్రీనివాసరెడ్డి, దామోదర్ రెడ్డి, దుర్గారెడ్డి, మత్స్య కార్మిక సంఘం ఉపాధ్యక్షులు దైద సాలయ్య తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking