కెపిహెచ్ బిలో ఆగని అక్రమ నిర్మాణాలు
మామూళ్ల మత్తులో మూసాపేట్ సర్కిల్
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి : అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కళ్లెం వేయాల్సిన అధికారులే కాసులకు కక్కుర్తి. భారీ భవంతుల అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికి మిన్నకుండి పోయే పరిస్థితి. కూకట్ పల్లి జోన్ పరిధిలోని మూసాపేట్ సర్కిల్ లో క్షేత్రస్థాయిలో అధికార యంత్రం అలసత్యంతో అక్రమ నిర్మాణలు హెచ్చు మీరుతున్నాయి. అధికారులు అవినీతి జబ్బుతో తీవ్ర అస్వస్తతో బాధ పడుతున్నారు. అక్రమ నిర్మణాలు అడ్డుకోలేని పరిస్థితిలో తప్పించుకుంటున్నారు. ఒక్క రోజు కాదు కొంతకాలంగా ఇదే తంతు నడుస్తోంది. ముడుపుల మత్తులో కూరుకుపోయి అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించడం మరిచారు.మూసాపేట్ సర్కిల్ పరిధిలోని( 189 ప్లాట్ నెంబర్) లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు అందుకు నిదర్శనం. కేవలం టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సాగుతున్న ఈ అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇప్పటికయిన సంబంధిత సర్కిల్ డిసి, ఏసిపి, లు సెక్షన్ ఆఫీసర్ మహేందర్ స్పందించి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.