కర్ణాటక ఫలితాలు
బిజెపికి చెంపపెట్టు
దేశంలో ముందస్తు వచ్చే అవకాశం
*ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
దేశంలో ముందస్తుగా పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, పార్లమెంటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఒకేసారి జరిగే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి జోస్యం చెప్పారు. సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం ముందు వస్తే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కర్ణాటక ప్రజలు తిప్పి కొట్టారని చెప్పారు కర్ణాటక ప్రజలు తెలివితో బిజెపికి మంచి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు అక్కడ ప్రభుత్వం మనుషుల మధ్య విద్వేషాలు సృష్టించడం వల్ల ప్రజలు అది వాటిని గమనించి ఓటు రూపంలో బిజెపిని ఓడించారని చెప్పారు. బిజెపి కుట్రలను దేశ ప్రజలకు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బిజెపిని గద్ది దింపి బుద్ధి చెప్తారని తెలిపారు. తెలంగాణలో బిజెపిని అడుగుపెట్టనీయబోమని చెప్పారు. లౌకిక పార్టీలతో పొత్తు తప్పనిసరిగా ఉంటుందని వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులు అసెంబ్లీలో అడుగు పెడతారని చెప్పారు. దీనికోసం కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు గ్రామ వార్డు స్థాయిలో పార్టీ నిర్మాణంకు కృషి చేయాలని కోరారు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి రవి నాయక్ వినోద్ నాయక్, పాదూరి శశిధర్ రెడ్డి, పోలే బోయిన వరలక్ష్మి, తిరుపతి రామ్మూర్తి, రాగిరెడ్డి మంగారెడ్డి, రెమిడాల పరశురాములు, ఎండి అంజాద్, ఆయూబ్,రొంది శ్రీనివాస్,జాతంగి సైదులు, సత్యనారాయణ రావు, యాదగిరి, సైదమ్మ, దయనంద్, పాపా నాయక్, కందుకూరి రమేష్, పిల్లుట్ల సైదులు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.