క్రీడలతోనే శరీర ధారుఢ్యం

క్రీడలతోనే శరీర ధారుఢ్యం

సిఎం కప్ క్రీడాపోటీలు ప్రారంభo

ఎమ్మెల్యే భాస్కర్ రావు

వేములపల్లి, అక్షిత ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సిఎం కప్ 2023 మండల స్థాయి గ్రామీణ క్రీడా పోటీలను సోమవారం వేములపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రారంభించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువతి యువకుల్లో దాగివున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సిఎం కప్2023క్రీడలు దోహదపడుతాయన్నారు. మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను ఆపై డివిజన్ జిల్లా రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుందన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు క్రీడా నైపుణ్యం కలిగి తమ ప్రతిభను చాటిచెప్పాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి పుట్టల సునీత కృపయ్య, జెడ్పిటిసి ఇరుగు మంగమ్మ వెంకటయ్య, జెడ్పి కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ మోసిన్ అలీ, వైస్ ఎంపిపి పాదూరి గోవర్దని, సర్పంచులు చిర్ర మల్లయ్య యాదవ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, మజ్జిగపు పద్మ సుధాకర్ రెడ్డి, ఎంపిడిఓ అజ్మీరా దేవిక, బిఆర్ఎస్ నాయకులు నామిరెడ్డి యాదగిరిరెడ్డి పాలుట్ల బాబయ్య కట్టా మల్లేష్ గౌడ్, గౌరు శ్రీనివాస్, ఉగ్గే మునీశ్వర్, పుట్టల భాస్కర్, నాగవెళ్లి శంకర్, మాలి శంకర్ రెడ్డి, అమరరాపు తిరుమలేష్, దైద జాన్సన్, పుట్టల పౌల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking