*మూడు చక్రాల మోటార్ సైకిల్ పంపిణీ*
*చౌటుప్పల్ తాసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి*
చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు “గిఫ్ట్ – ఏ – స్మైల్” లో భాగంగా చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన లందగిరి అంజయ్య దివ్యాంగ కుమార్తెలైన రేణుక, సంద్య లకు బ్యాటరీతో నడిచే మూడు చక్రాల మోటార్ సైకిల్ మంత్రి కార్యాలయం నుండి చౌటుప్పల్ తాసీల్దార్ కార్యాలయం కు పంపియడం జరిగినది. ఈ మోటర్ సైకిల్ ను దివ్యాంగులైన రేణుక, సంద్యలకు చౌటుప్పల్ తహసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి చేతుల మీదుగా తహసిల్దార్ కార్యాలయంలో అందజేశారు.