*ఉద్యమాల రారాజు
మారోజు వీరన్న*
*వీరన్న కూతురు మారోజు దిశ*
తుంగతుర్తి, అక్షిత ప్రతినిధి :
విముక్తి కోసం, కుల, వర్గ పోరాటాలను నిర్మించాలన్న సిద్ధాంతాన్ని నమ్ముకుని ఆ బాటలో పయనించిన విప్లవ వీరుడు కామ్రెడ్ మారోజు వీరన్న అని , మారోజు వీరన్న కూతురు మారోజు దిశ అన్నారు. కులవర్గ నిర్మూలన పోరాట సిద్ధాంతకర్త, తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదిన నాయకుడు దళిత బహుజన ఉద్యమ స్ఫూర్తి కామ్రేడ్ మారోజు వీరన్న 24వ వర్ధంతి పురస్కరించుకొని మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రం నుండి కరివిరాల కొత్తగూడెం గ్రామం వరకు భారీ బైక్ ర్యాలీ ముందుగా మారోజు వీరన్న కూతురు దిశతో కలిసి ఆయన స్తూపం వద్ద ఘన నివాళులర్పించి వీరన్న గ్రంథాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పడిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ…ఆస్థిత్వ ఉద్యమాల నిర్మాణం ద్వారా సమస్త ప్రజల విముక్తికి పూల బాటలు వేసిన బహుజనుడు మారోజు అన్నారు. ఈ ప్రపంచానికి దూరమై 24 ఏళ్లవుతున్న సందర్భంగా ఆయన్ను స్మరించుకోవటం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు.పీడిత జన సామాజిక విప్లవకారుడు, మలిదశ తెలంగాణా పోరాట ఆద్యుడు, కుల వర్గ జమిలి పోరాటాల నిర్మాతగా వీరన్న చరిత్ర పుటల్లో నిలిచిపోతారన్నారు.ప్రతి అస్థిత్వ పోరాటంలోనూ ఆయన సజీవంగానే ఉంటారన్నారు.1996లో జనశక్తి నుంచి బయటకొచ్చేసిన వీరన్న విప్లవ ఉద్యమాలు చిరకాలం నిలబడటానికి కులపోరాటం కూడా చేయాల్సి ఉందని పిలుపునిచ్చిన ఈ కాలం వీరుడని ఆ పోరాటాలు సఫలమైనప్పుడే బహుజనులకు విముక్తి లభిస్తుందని ఎలుగెత్తి చాటిన గళం ..మారోజు అన్నారు.మారోజు వీరన్న అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ తుంగతుర్తి మండల ఇన్చార్జి పోతురాజు, మారోజు వీరన్న కుటుంబ సభ్యులు, అభిమానులు, ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.