ఇంటర్ స్టేట్ ర్యాంకర్ ను అభినందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ….
మేడ్చల్, అక్షిత బ్యూరో : దుండిగల్ పురపాలక పరిది దుండిగల్ తాండా టూ కు చెందిన కాట్రోత్ కమల బాలు నాయక్ దంపతుల కుమార్తె, చింతల్ నారాయణ కళాశాల విద్యార్థిని కాట్రోత్ కీర్తి ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో స్టేట్ 4వ ర్యాంక్ సాధించింది. ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని 27వ వార్డు కౌన్సిలర్ శంకర్ నాయక్ఆధ్వర్యంలో మంగళవారంశంభీపూర్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ విద్యార్థినిని అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆకుల ప్రభాకర్ గుప్తా, బీమా నాయక్ పాల్గొన్నారు.