తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు స్టాల్స్ ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు స్టాల్స్ ఆహ్వానం

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

సింగరేణి కాలిరీస్ కంపెనీ లిమిటెడ్ మందమర్రి ఏరియా ఆధ్వర్యంలో జూన్ 2న 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరణ చేసి వేడుకలను ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సింగరేణి హైస్కూల్ గ్రౌండ్స్‌లో ఫుడ్ స్టాల్స్, ఇతర స్టాల్స్ ఏర్పాటు చేయదలచిన ఆసక్తి గల వారికి ఆహ్వానం పలికారు. స్టాల్స్ ఏర్పాటు చేయదలచిన వారు ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయంలో తమ పేరు, స్టాల్ వివరాలు నమోదు చేసుకుని టోకెన్ పొందవలసిందిగా సూచించారు.మరిన్ని వివరాలకు సెల్ నంబర్లు 7013359316, 8688150431లను సంప్రదించాలని తెలిపారు. ఈ వేడుకల్లో సింగరేణి ఉద్యోగులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking