3న నకిరేకల్ లో టీయూడబ్ల్యూజే మహాసభ

జూన్ 3న నకిరేకల్ లో టీయూడబ్ల్యూజే మహాసభ

* జిల్లాలో సభ్యత్వ క్యాంపెయిన్ కు అనూహ్యమైన స్పందన
*
* 27న సాయంత్రంతో సభ్యత్వాల నమోదు ముగింపు
* టీయూడబ్ల్యూజే(ఐజేయు) నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి
*
నల్గొండ టౌన్, అక్షిత న్యూస్ :

జూన్ 3 వ తేదీన నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో టియుడబ్ల్యూజే ( ఐజేయు ) జిల్లా మహాసభను నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కలిమెల నాగయ్యలు తెలిపారు. మంగళవారం ఉదయం నల్లగొండలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మహాసభకు నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ప్రెస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి, టియూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.రామ నారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీ. ప్రభాకర్ రెడ్డి  హాజరవుతున్నారని తెలిపారు. మహాసభకు జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

నల్లగొండ జిల్లాలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ కు ప్రింట్,ఎలక్ట్రాన్ మీడియా, చిన్న పత్రికలు, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోందన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికిని సంఘం బాధ్యులంతా సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 27న సాయంత్రంతో సభ్యత్వ నమోదు ముగుస్తుందని పేర్కొన్నారు. ఇంకా సభ్యత్వ నమోదు పొందని వారు ఎవరైనా ఉంటే స్థానిక మండల నియోజకవర్గ జిల్లా బాధ్యులను సంప్రదించి సభ్యత్వo తీసుకోవాలని కోరారు. జిల్లాలోని ప్రతి జర్నలిస్టు హక్కుల కోసం టీయూడబ్ల్యూజే కృషి చేస్తుందని తెలిపారు. జర్నలిస్టులకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులను అందిస్తామని ఇందుకోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking