*విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం*
*-ఆరోగ్యమే మహాభాగ్యం*
*-కల్వకుర్తి శాసనసభ్యులు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్*
కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :
తలకొండపల్లి మండల పరిధిలోని వెల్జాల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి శ్రీ సంగీత శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జడ్చర్ల అమోఘ్ హాస్పిటల్ వైద్యులచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ పాల్గొని ప్రారంభించారు.

ఈ ఉచిత వైద్య శిబిరంలో 670 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనె సంకల్పంతో వెల్జాల్ గ్రామ సర్పంచ్ సంగీత శ్రీనివాస్ యాదవ్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం శుభసూచకమన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పల్లె దావకానాలతో ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తుందన్నారు.అదేవిధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నలుమూలల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను ప్రభుత్వమే కోట్ల రూపాయలను వెచ్చించి నిర్మిస్తుందన్నారు అని తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తలకొండపల్లి మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్,ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి,తలకొండపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంకర్,అమోఘ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వరప్రసాద్,అరుణ్ కుమార్,కీర్తి,సుమంత్ కుమార్,వివిధ గ్రామాల సర్పంచులు జయమ్మ వెంకటయ్య,చంద్రయ్య,విజయ్ కుమార్ రెడ్డి,రాములు,ధరణి శివశంకర్ రెడ్డి,హైమావతి రమేష్,చంద్రదన ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి,మాజీ సర్పంచ్ బాలకృష్ణయ్య,చౌదర్ పల్లి వార్డు సభ్యులు తూర్పుశ్రీను,వెల్జాల్ వార్డు సభ్యులు మనెమ్మ,యాదయ్య,విజయ్,శ్రీరామ్,జంగయ్య,పెంటయ్య గౌడ్,రైతు సమితి గ్రామ అధ్యక్షులు నరేందర్ గౌడ్,మోహన్ లాల్,లక్ష్మీనారాయణ గౌడ్,చంద్రయ్య,రాజు గుప్తా,రాములు,శ్రీకాంత్ యాదవ్,శేఖర్,బంధులాల్,శ్రీరామ్,రాములు,అశోక్,విజయ్, సుధాకర్, యాదగిరి, శేఖర్, రవి,చెన్నకేశవులు,శ్రీశైలం,సాయి అమోఘ హాస్పిటల్ వైద్య సిబ్బంది ప్రవీణ్,కురుమయ్య,సువర్ణ,శివలీల, సుజాత,వివిధ గ్రామాల ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.